SBI PO Prelims Exams: మార్చి 3, 16, 24 తేదీల్లో ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ పరీక్షలు! 1 y ago
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) -2024 ప్రిలిమినరీ పరీక్ష తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షను మార్చి 3, 16, 24 తేదీల్లో నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాల ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 16వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అభ్యర్దులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పీవోగా ఎంపికైన అభ్యర్ధులు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ తదనంతరం దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.